కోట్లు విలువైన మాదకద్రవ్యాలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేతుల మీదుగా ధ్వంసం చేశారు. గత మూడు నెలలుగా అసోం పోలీసులు రూ.163.58 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నాగాన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం శర్మ స్వయంగా బుల్డోజర్ నడిపి… డ్రగ్స్ ను ధ్వంసం చేశారు. అసోం యువకులు నిషేధిత మాదకద్రవ్యాలకు బలైపోతున్నారని, డ్రగ్స్ కోసం అసోంను రవాణా మార్గంగా ఉపయోగించడాన్ని తాము ఏ మాత్రం సహించోమని సీఎం హిమంత బిశ్వ స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మే 10 నుంచి జూలై 15 మధ్యకాలంలో అసోం పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం ప్రకారం 874 కేసులను నమోదు చేశారని తెలిపారు.
కాగా, గత మూడు నెలలుగా అసోం పోలీసులు రూ.163.58 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని శని, ఆదివారాల్లో థింపు, గోలఘాట్, బర్హంపూర్, హజోయి, నాగాన్ ప్రాంతాల్లో ధ్వంసం చేయగా… సీఎం హిమంత పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు @టుడే అప్డేట్