అస్సాంలో వరదలు బీభత్సం సృస్టిస్తున్నాయి. వరదల ధాటికి కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. అస్సాంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో పాటు తుఫానుల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముగ్గురు మరణించారు. శనివారం సాయంత్రం కుంభవృష్టి కురువడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో 94 గ్రామాలు నీటమునగగాయి. 24,681 మంది వరదల్లో చిక్కుకున్నారు. దిమా హసావ్ జిల్లాలోని 12 గ్రామాల్లో కొంచరియలు విరిగిపడ్డాయి. వరదల ధాటికి హాఫ్లాంగ్ ప్రాంతంలో ముగ్గురు మృతిచెందగా, 80 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రోడ్డు కొట్టుకుపోయాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement