సెల్ఫిష్ చిత్రంతో కాశీ విశాల్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ నటించనున్నాడు. కాగా ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అధికారికంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి తమిళ స్టార్ ధనుష్ అతిథిగా హాజరై టీమ్‌ను ఆశీర్వదించారు. అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్, హరీష్ శంకర్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ మూవీలో ఆశిష్ కు జోడిగా శ్రీలీల కనిపించబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను దిల్ రాజు, సుకుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. మిక్కీ జే మేయర్ “సెల్ఫిష్” చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది. కాగా జనవరిలో “రౌడీ బాయ్స్”తో నటనా రంగ ప్రవేశం చేసిన ఆశిష్ కి ఇది రెండవ చిత్రం.
Advertisement
తాజా వార్తలు
Advertisement