ప్రపంచ క్రికెట్ లోని అత్యుత్తమ కెప్టెన్ లలో భారత మాజీ కెప్టెన్ ఏం.ఎస్. ధోని ఒక్కడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని.. అప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ఇక తాజాగా ఆఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. టీ20ల్లో అస్గర్ నాయకత్వంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 42 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం ద్వారా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న 41 రికార్డును బ్రేక్ చేసాడు. అయితే ఇప్పటి వరకు అస్గర్ 52 మ్యాచ్‌ల్లో ఆప్ఘన్ జట్టుకు నాయకత్వం వహించగా.. ఇందులో 42 మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్నాడు. టీమిండియా తరపున ధోనీ తన కెరీర్‌లో 72 టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించగా.. ఇందులో 41 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది.
ఆస్గర్, ధోని తర్వా త స్థానాల్లో టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. మోర్గాన్ ఇప్పటివరకూ 59 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 33 విజయాలను అందించాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటివరకూ 45 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 27 విజయాలను దక్కించుకున్నాడు.