Friday, November 22, 2024

Cyclone ‘Asani’: తీవ్ర తుపానుగా ‘అసని’.. ఒడిశా, ఉత్తరాంధ్ర వైపుగా పయనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను తీవ్ర తుపానుగా మారింది. అసని తుఫాను ఆదివారం సాయంత్రం ఉత్తర ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరం దిశగా వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నంకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ రేపటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అక్కడి నుంచి దిశ మార్చుకుని ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని తెలిపింది.

ఈ తుపాను ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించింది. ఈ నెల 11న కూడా ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఇదే తరహా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. తుపాను బలపడి తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. అసని ఈ నెల 12వ తేదీ నాటికి వాయుగుండంగా బలహీనపడుతుందని వివరించింది. అప్పటివరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement