బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు .. డ్రగ్స్ కేసులో నిందితుడు ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. ఈ కేసులో ప్రస్తుతం బెయిల్ పొందిన ఆర్యన్ ప్రతి శుక్రవారం దర్యాప్తు అధికారులను వ్యక్తిగతంగా కలవాల్సి వస్తోంది. ఆ హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆర్యన్ అభ్యర్థనను కోర్టు మన్నించింది. ఇక వారం వారం దర్యాప్తు కోసం అధికారుల ముందు హాజరవ్వాల్సిన పని లేదని, అయితే వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ముంబై తీరంలో ఓ క్రూయిజ్ నౌకలో జరిగిన పార్టీలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు ఆర్యన్. ఈ కేసును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement