Saturday, November 23, 2024

Drug Case: జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుక్​ ఖాన్ తనయుడు ఆర్యన్​ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. డ్రగ్స్ కేసును విచారించిన ముంబై హైకోర్టు ఆర్యన్ ను బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ పత్రాలు అందడంలో జాప్యం కావడంతో ఆర్యన్ శనివారం విడుదలైయ్యాడు. అక్టోబరు 3న క్రూయిజ్​షిప్​లో రేవ్​పార్టీ, డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్​ ఖాన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి దాదాపు మూడు వారాలుగా జైలులోనే ఉన్నాడు. బెయిల్ కోసం అతని తరఫు న్యాయవాదులు పలుమార్లు ప్రయత్నించినప్పుటికీ, కోర్టు దానిని మంజూరు చేయలేదు. అక్టోబరు 28న ఆర్యన్​తో పాటు మరో ఇద్దరికి బెయిల్​ మంజూరు చేసింది. కోర్టు ఆర్డర్లు జైలు అధికారులు చేరలేదు. దీంతో శుక్రవారం ఆర్యన్ ఖాన్‌ విడుదల ప్రక్రియ జరగలేదు. శనివారం బెయిల్ ఆర్డర్ పేపర్లు అధికారులకు చేరాయి. దీంతో ఆర్యన్ ఖాన్‌ను జైలు నుంచి బయటకు పంపించారు. తనయుడు ఆర్యన్ ఖాన్‌ను ఇంటికి తీసుకొచ్చుకునేందుకు స్వయంగా షారూఖ్ ఖాన్ ప్రత్యేకంగా కారులో వెళ్లారు

ఇది కూడా చదవండి: బద్వేల్ ఉపఎన్నిక: అట్లూరులో దొంగ ఓట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement