రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లండన్‌లో గ్రీన్ యాపిల్ అవార్డులను అందుకున్నారు. మొజాంజాహీ మార్కెట్, సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదగిరిగుట్ట దేవాలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి. ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్లింగ్స్ కేటగిరీలో ఈ అవార్డులు లభించాయి.
ఇక.. దేశంలోని పలు నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడం తెలంగాణకు దక్కిన మరో ఘనతగా చెప్పుకోవచ్చు. ఇక్కడి భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం పడుతున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఇప్పటికే వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డ్ (2022), ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్ (2021), లివింగ్, ఇన్‌క్లూజన్ అవార్డ్-స్మార్ట్‌సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్ (2021) వంటి ప్రపంచస్థాయి అవార్డులను సొంతం చేసుకున్నది.