Friday, November 22, 2024

Breaking: తప్పిపోయిన వ్యక్తిని అప్పగించిన చైనా.. తమవైపు వచ్చిండని బంధించిన పీఎల్​ఏ..

అరుణాచల్ ప్రదేశ్‌లో అదృశ్యమైన యువకుడిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత సైన్యానికి అప్పగించినట్లు న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన 19 ఏళ్ల మిరామ్ టారోన్ జనవరి 18న అదృశ్యమయ్యాడు. బాలుడికి వైద్య పరీక్షలతో పాటు తగిన  భద్రత చర్యలు అనుసరిస్తున్నట్లు మంత్రి ఒక ట్వీట్‌లో తెలిపారు. ‘చైనీస్ PLA అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మిరామ్ టారోన్‌ను భారత సైన్యానికి అప్పగించింది. వైద్య పరీక్షతో సహా తగిన విధానాలు అనుసరిస్తున్నాయి’’ అని అతను ట్విట్టర్​లో తెలిపారు.

లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి)కి దగ్గరగా ఉన్న ప్రాంతం నుండి తప్పిపోయినందున భారత సైన్యం జనవరి 19న వెంటనే చైనా వైపుకు చేరుకుందని..  అతను దారితప్పినట్లయితే, ఆ వ్యక్తిని కనుగొనడంలో,  తిరిగి తీసుకురావడానికి సహాయం కోరినట్టు మంగళవారం లోక్​సభలో రిజిజు చెప్పారు. చైనీస్ భూభాగంలోకి వెళ్లిన  అతడిని పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (PLA)తమ అదుపులోకి తీసుకుంది. తమ భూభాగంలోకి చొరబడ్డ  బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న చైనా సైన్యంతో ఇండియన్​ ఆర్మీ సంప్రదింపులు జరిపింది.  ఐడెంటిటీ కోసం వ్యక్తిగత వివరాలు, ఫొటోను ధ్రువీకరించడంలో చైనాకి  భారత సైన్యం సాయం చేసింది. దీంతో  ప్రోటోకాల్‌ ప్రకారం ఆ వ్యక్తిని వెతికి తిరిగి ఇస్తానని చైనాతరఫునుంచి హామీ వచ్చిందని మంత్రి కిరణ్​ రిజుజు తెలిపారు. ఆ హామీకి తగ్గట్టే తప్పిపోయిన బాలుడిని రప్పించడంలో తమ సంప్రదింపులు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement