భారత్‌పై చైనా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. అందివచ్చిన ఏ చాన్స్ ని కూడా వదలడం లేదు. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుని.. భారత్ ఆగ్రహానికి గురయ్యింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేయగ.. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ ఓ ప్రకటన చేశారు. దక్షిణ టిబెట్‌లో అరుణాచల్‌ప్రదేశ్ తమ భాగమని.. తాము పేర్లు పెట్టడంలో ఎలాంటి తప్పు చేయలేదంటూ సమర్థించుకోవడం గమనార్హం.
ఇది తమ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం అంటూ.. తేలిగ్గా కొట్టిపారేయడం విశేషం. అరుణాచల్‌లో ఎన్నో సంప్రదాయ తెగలు చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నాయని జావో చెప్పుకొచ్చాడు. స్వయంప్రతిపత్తిగల ప్రాంతానికి తాము పేర్లు పెట్టడంలో తప్పేంటని ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అరుణాచల్ భారత్ భూభాగం అని, కవ్వింపు చర్యలు మానుకోవాలంటూ భారత్ ధీటుగానే సమాధానం ఇచ్చింది. అయినా బెదరని డ్రాగన్.. తన వంకర బుద్ధి ప్రదర్శించింది. పేర్లు పెట్టినంత మాత్రానా.. అరుణాచల్‌ప్రదేశ్ చైనాది అయిపోదంటూ చురకలు అంటించింది. చాలా ఏళ్లుగా అరుణాచల్ తమదంటూ చైనా వాదిస్తోంది. ఆ ప్రాంతాన్ని జన్‌గ్నాన్‌గా పిలుస్తోంది.