Friday, November 22, 2024

Artemis-1: చందమామను చేరుకున్న ఓరియన్​ స్పేస్​క్రాఫ్ట్​.. వీడియో రిలీజ్​ చేసిన నాసా (LIVE)

కేప్ కెనావెరల్లోని ఫ్లోరిడా తీరం నుండి ప్రయోగించిన ఓరియన్ అంతరిక్ష నౌక తన లక్ష్యాన్ని చేరుకుంది. ఆఖరి గమ్యస్థానమైన చంద్రుడిని చేరుకోవడానికి అది రెడీగా ఉందని నాసా ఇవ్వాల (సోమవారం) ఓ వీడియోని రిలీజ్​ చేసింది. త్వరలోనే చంద్ర మండలంపైకి మానవులను పంపి.. తిరిగి రప్పించే ప్రయోగాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ అంతరిక్ష నౌక దాని 25.5 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆరో రోజున చంద్రునిపై సందడి చేయనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంతకుముందు అంతరిక్ష నౌక చంద్రుని ప్రభావ గోళంలోకి ప్రవేశించిందని, భూమికి బదులుగా చంద్రుడిని ప్రధాన గురుత్వాకర్షణ శక్తిగా అంతరిక్ష నౌకపై పనిచేస్తోందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, ఆర్టెమిస్-1 రాకెట్ యొక్క లిఫ్ట్ ఆఫ్ అపోలో ట్విన్​ సిస్టర్​గా పేరుపెట్టిన NASAకి చెందిన ఆర్టెమిస్ చంద్ర అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2024లో తదుపరి ఫ్లైట్​లో చంద్రుని మీదికి నలుగురు వ్యోమగాములను పంపి, 2025 నాటికి అక్కడ మానవులను దింపాలని అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా టార్గెట్​​ పెట్టుకుంది.

- Advertisement -
YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement