అమరావతి ఎంపీ నవనీత్ రాణా..ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకి హనుమాన్ చాలీసా కేసులో మహారాష్ట్రలోని సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వీరిద్దరూ ఏప్రిల్‌లో వారి ఖార్ నివాసం ముంబైలో మత శాంతికి విఘాతం కలిగించారని, మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. శివసేనకు హిందుత్వ సూత్రాలను గుర్తు చేసేందుకు గత సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇళ్లు మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పారు.
దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల వారు ఈ ఈవెంట్‌ను రద్దు చేసుకున్నారు. ఈ జంటపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 153 (ఎ) (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్యాన్ని కాపాడటానికి విఘాతం కలిగించే చర్యలు చేయడం), ముంబై పోలీసు చట్టంలోని సెక్షన్ 135 (పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేశారు.