రాష్ట్రంలో స్కూళ్లు తెరుచుకోవడంతో తల్లిదండ్రులు విద్యార్థులను ధైరంగా పంపిస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని తెలిపారు. బుధవారం విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్కూళ్లల్లో పారిశుధ్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం నిబంధనలు పాటిస్తూ పాఠశాలను ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామపంచాయతీ, జిహెచ్ఎంసి, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్యం శుభ్రంగా ఉందన్నారు. పిల్లల పేరెంట్స్ ధైర్యంగా పంపిస్తున్నారని చెప్పారు. డివోలు, ప్రధానోపాధ్యాయులు గతంలో కన్నా ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కొవిడ్ నిభందనలు తప్పక పాటించాలని ఆదేశాలు ఇచ్చామని…ప్రార్థన సమయంలోనే జాగ్రత్తలు గుర్తు చేయాలని తెలిపారు. 60 లక్షల మంది విద్యార్థుల్లో 20 లక్షల మంది ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారన్నారు. లక్ష ఇరవై వేల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చారని మంత్రి తెలిపారు. ఇంటర్ లో లక్షమంది వరకు ప్రభుత్వ కాలేజీలో చేరారని వివరించారు.
ఈ ఏడాది ఫస్ట్ క్లాస్లో అదనంగా లక్ష మంది జాయిన్ అయ్యారని మంత్రి వెల్లడించారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలో దాదాపు రెండున్నర లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయన్నారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలా చూసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. మధ్యాహ్న భోజన సమయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలని, డివోలు, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పేరెంట్స్ నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులందరూ వ్యవహరించాలని సూచించారు. రెసిడెన్షియల్ తప్ప మిగతా పాఠశాలలను ప్రారంభమైనట్లు మంత్రి సబితా చెప్పారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించి విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. భౌతిక తరగతులకు ముందే సిబ్బందని స్కూళ్లను శుభ్రం చేయించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించిన తర్వాతే తరగతులకు అనుమతించారు.
ఇది కూడా చదవండి: ఈ సారైనా అన్నాచెలెళ్లు కలుస్తారా?