Tuesday, November 26, 2024

New Army uniform: మారిన ఇండియన్ ఆర్మీ యూనిఫామ్…

ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ మారింది. ఆర్మీ డే సందర్భంగా భారతీయ అత్యున్నత కమెండో దళం సరికొత్త యూనిఫామ్ తో ఈ రోజు కవాతులో పాల్గొన్నారు. పారా స్పెషల్ ఫోర్సెస్, అధికారికంగా యూనిఫామ్ మార్పుకు సంకేతాలు ఇచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (NIFT) చే డిజిటల్ యూనిఫామ్ తయారు చేయబడింది.

యూఎస్ ఆర్మీ యూనిఫామ్ తరహాలో భారత ఆర్మీ కొత్త యూనిఫామ్ ఉండనుంది. ఆధునిక ఆర్మీ యూనిఫామ్ ప్రస్తుత దుస్తుల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కొత్త దుస్తులలో మట్టి రంగు, ఆలివ్‌తో సహా అనేక రకాల రంగులు ఉన్నాయి. ఈ యూనిఫామ్‌ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో, స్వదేశీ సంస్థలు రెడీ చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement