Saturday, November 23, 2024

Arilines: నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసులు.. అమెరికాకు ఇక‌మీద‌ట‌ డైరెక్ట్‌గా వెళ్లొచ్చు..

కొవిడ్ ఆంక్షల సడలింపుతో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ లైన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో కొత్తగా ఇండియా టు అమెరికా నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసు కూడా ప్రారంభమైంది. దాదాపు పదేళ్ల త‌ర్వాత‌ ఇప్పుడు ఇండియా నుంచి డైకెక్టుగా విమానాలు అమెరికాకు పయనమవుతున్నాయి. ఇప్పటి దాకా ఇండియా నుంచి అమెరికాకు వెల్లాలంటే దుబాయ్ లేదా లండన్ మీదుగా వెళ్లాల్సి ఉండేది.

ఇండియా అమెరికాల మధ్య రాకపోకలు పెరిగిన కార‌ణంగా నాన్‌స్టాప్ ఫ్లైట్స్ ఏర్పాటు చేశాయి ఎయిర్ లైన్ సంస్థ‌లు. ఐటీ రంగం డెవ‌ల‌ప్ అయిన కొద్దీ ఈ రెండు దేశాల మధ్య రిలేష‌న్స్ కూడా రోజు రోజుకూ పెరుగుతూ వ‌స్తున్నాయి. ఇప్ప‌టిదాకా ఇండియా, అమెరికా మ‌ధ్య‌ కనెక్టింగ్ ఫ్లైట్ తప్ప మరో అవకాశం లేకుండా ఉండేది.. 2007లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) సంస్థ షికాగో నుంచి ఢిల్లీకి నాన్‌స్టాప్ ఫ్లైట్స్ న‌డిపింది. అయితే ఐదేళ్ల త‌ర్వాత‌ ఆ సర్వీసుల్ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2012లో రద్దు చేసింది.

ఆ త‌ర్వాత 2019లో వ‌చ్చిన కొవిడ్ కారణంగా మొత్తం విమాన సర్వీసులే రద్దయ్యాయి. కొవిడ్ రిలాక్సేష‌న్స్ త‌ర్వాత ఆంక్షలు తొలగి ఇంట‌ర్నేష‌న‌ల్‌ విమాన ప్రయాణాలకు ప‌ర్మిష‌న్ లభించింది. ఈ సందర్భంగా మ‌ళ్లీ ఇండియా-అమెరికా నాన్‌స్టాప్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. అమెరికా ఎయిర్‌లైన్స్ సంస్థ ఆ సర్వీసుల్ని ప్రారంభించింది. న్యూయార్క్ నుంచి డైరెక్ట్‌గా ఢిల్లీకి విమాన సేవలు ఐదురోజుల క్రితం ప్రారంభమయ్యాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి (Newyork to NewDelhi Nonstop Flight) తొలి నాన్‌స్టాప్ విమానం నవంబర్ 13న‌ చేరుకుంది. ప్రస్తుతం వీకెండ్స్‌లో ఈ ఫ్లైట్ అందుబాటులో ఉంటుంద‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. త్వరలో మరిన్ని సర్వీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రెండో నాన్‌స్టాప్ విమాన సర్వీసును అమెరికాలోని సియాటెల్ నుంచి బెంగళూరుకు మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో ప్రారంభించే అవకాశాలున్నాయ‌ని తెలుస్తోంది. త‌ర్వాత న్యూయార్క్-ముంబై, శాన్‌ఫ్రాన్సిస్కో-బెంగళూరు మధ్య మరో రెండు సర్వీసులు ప్రారంభించే యోచనలో ఎయిర్‌లైన్ సంస్థ‌లున్న‌ట్టు స‌మాచారం. నాన్‌స్టాప్ సర్వీసులకు ప్రస్తుతం బోయింగ్ 777 విమానాలు ఉపయోగిస్తున్నారు. ఇందులో 304 మంది ప్రయాణించవచ్చు. ఎకానమీ క్లాస్‌లో 216, ప్రీమియం ఎకానమీలో 28, బిజినెస్ క్లాస్‌లో 52, ఫస్ట్‌క్లాస్‌లో 8 సీట్లు అందుబాటులో ఉంటాయి.

ఇండియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఫుడ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఈ ఎయిర్‌లైన్స్‌లో ఉంటుంది. అదే సమయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థ దేశీయంగా ఇండిగోతో (Indigo Airlines) కూడా జత కట్టింది. నాన్‌స్టాప్ ఫ్లైట్స్ ద్వారా ఇండియా చేరుకున్న ప్రయాణికులు దేశంలోని స్వస్థలాలకు వెళ్లేందుకు ఇండిగో త‌గిన ఏర్పాట్లు చేయ‌నుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement