హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశంలో అతిపెద్ద, స్పెషాలిటీ ప్లాంట్ న్యూట్రీషన్ కంపెనీ అయిన ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ చైర్మన్ క్లబ్ వ్యాపార సదస్సు నోవాటెల్‌లో జరిగింది. కొత్త ఉత్పత్తులను ప్రారంభించడంలో ఎప్పుడూ ముందుండే సంస్థ ఈ కార్యక్రమంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మట్టిని స్కాన్ చేసే పరికరాన్ని ప్రారంభించింది. ఇలాంటి పరికరం దేశంలోనే మొదటిది కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఈ వినూత్న పరికరంతో పాటు ఏరీస్ ఆగ్రో కొత్త ఉత్పత్తులైన ఆర్గాబూస్ట్, క్లామాక్ష్, మేజర్సాల్ చిల్లి, మేజర్సాల్ మిల్లెట్స్‌లను ప్రారంభించింది.
ఈ సందర్భంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ చైర్మన్, ఎండి డా.రాహుల్ మిర్చందానీ మాట్లాడుతూ ఏరీస్ ఆగ్రో ఈ ప్రత్యేకమైన మట్టి స్కానింగ్ పరికరం ఉత్పత్తి కోసం ఐఐటి-కె బిజిసెన్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో ఒక సహకారాన్ని కుదుర్చుకుందని చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి ఈ ఉత్పత్తులు సహాయం చేస్తాయన్నారు. 250 గ్రాముల బరువున్న 6 అంగుళాల పోర్టబుల్ మెషీన్ ఎటువంటి రసాయనాలు అవసరం లేకుండా పరీక్షలు చేసి ఫలితాన్ని రెండు నిమిషాల్లో ఇస్తుంది.