Saturday, November 23, 2024

క‌ర్ణాట‌క హైకోర్టులో ‘హిజాబ్’ పై వాద‌న‌లు – రేప‌టికి వాయిదా వేసిన కోర్టు

హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క హైకోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి. కాగా రేప‌టికి తీర్పుని వాయిదా వేసింది కోర్టు. కాగా నేడు త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదలు వాదనలను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్థీ సారథ్యంలోని ధర్మాసనం వింది. ఈ రోజు కూడా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సీరియస్‌గా వాదనలు వినిపించారు. అడ్వకేట్ రవి వర్మ కుమార్ పిటిషనర్ల తరఫు వాదిస్తూ.. వేలాది మతాల గుర్తులను, సంకేతాలను, వారి మతాలను వ్యక్తపరిచే వాటినీ ధరించి రావడానికి అనుమతిస్తుండగా కేవలం హిజాబ్‌ను మాత్రమే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.
దుపట్టాలు, గాజులు, టర్బన్‌లు, శిలువలను, బొట్టులను ధరించే వారిని ఎందుకు ప్రతి రోజు అనుమతిస్తున్నారని అడ్వకేట్ రవి వర్మ కుమార్ వాదించారు. మన విశాల సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన మతపరమైన సంకేతాలను మాత్రమే చర్చిస్తున్నారని తెలిపారు.

అందులో కేవలం ఒక్క హిజాబ్‌ను మాత్రమే ఎందుకు వద్దు అంటున్నారని అడిగారు. హిజాబ్ ఒక్క దాన్నే వద్దనడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. గాజులు వేసుకుంటున్నారని, అది మతపరమైన సింబల్ కాదా? అని అడిగారు. మీరు ఎందుకు కేవలం ముస్లిం అమ్మాయిలనే ఎంచుకున్నారని అడిగారు. కర్ణాటక ఎడ్యుకేషన్ చట్టంలో యూనిఫామ్‌లో దేన్నీ నిషేధించినట్టు లేదని, అలాంటప్పుడు కేవలం హిజాబ్‌ను ఎలా నిషేధించగలరని అన్నారు. ఒక వేళ ఎడ్యుకషన్ ఇన్‌స్టిట్యూట్ యూనిఫామ్‌ను మార్చాలని భావిస్తే.. ఒక ఏడాది ముందుగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను పేరెంట్స్ అందించాలని పేర్కొన్నారు. కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీలో ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండటాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఒక పార్టీ లేదా.. ఒక భావజాలాన్ని కలిగి ఉన్న ఎమ్మెల్యేకు విద్యా సంస్థల నిర్ణయాలకు సంబంధించిన అంశాన్ని అప్పగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కమిటీ కూర్పు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement