Saturday, November 23, 2024

మ‌ధ్య‌ద‌రా స‌ముద్రంలో.. ఏడువేల ఏళ్ళ‌నాటి రోడ్డు

ఏడువేల ఏళ్ళ‌నాటి రోడ్డు బ‌య‌ట‌ప‌డింది. అది కూబా మ‌ధ్య‌ద‌రా స‌ముద్రం అట్ట‌డుగున‌..ఆశ్చ‌ర్య‌పోయారా..కానీ ఇది నిజం.,
పురావ‌స్తు ప‌రిశోధ‌న‌ల్లోనే అత్యంత ఆశ్చ‌ర్యం గొలిపేలా ఈ రోడ్డు మార్గం బ‌య‌ట‌ప‌డింది.మ‌ధ్య‌ద‌రా స‌ముద్రం అట్ట‌డుగున మ‌ట్టి వెనుక ఈ పురాత‌న ర‌హ‌దారిని క‌నుగొన్నారు. ఈ రహదారి క్రొయేషియన్ ద్వీపంలో ఉన్న కోర్కులా ద్వీపం తీరంతో హ్వార్ సంస్కృతి యొక్క మునిగిపోయిన పూర్వ స్థావరాన్ని క‌లుపుతుంద‌ని భావిస్తున్నారు. ఈ రహదారి నాలుగు మీటర్ల వెడల్పుతో జాగ్రత్తగా పేర్చబడిన రాతి పలకలతో రూపొందించబడిందట‌. గ‌త పురావ‌స్తు ప‌రిశోధ‌న‌ల్లో భాగంగా దొరికిన వుడ్‌ను రేడియోకార్బ‌న్ అనాలిసిస్ ద్వారా ప‌రిశీలించ‌గా వెల్ల‌డైన అంశాల‌ను క్రొయేషియా యూనివ‌ర్సిటీ ఆఫ్ జ‌ద‌ర్ ప‌రిశోధ‌కులు ఫేస్‌బుక్ పోస్ట్‌లో షేర్ చేశారు.

దాదాపు 7000 సంవత్స‌రాల కింద‌ట ఈ రోడ్డుపై ప్ర‌జ‌లు న‌డిచేవార‌ని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. నియోలిథిక్ సెటిల్‌మెంట్‌లో ఈ రహదారి భాగమ‌ని చెబుతున్నారు. హ్వార్ సంస్కృతిలో నివ‌సించే వారిలో నైపుణ్యం కలిగిన రైతులు, పశువుల కాపరులు తీరం వెంట ఆ సమీపంలోని ద్వీపాలలో చిన్న, చిన్న స‌మూహాలుగా నివ‌సించే వారు. కొర్కులా ద్వీపంలోని వెలా లుక స‌మీపంలో గ్రాండినా బే వ‌ద్ద జ‌రిగిన భూ ప‌రిశోధ‌న‌లో భాగంగా స‌ముద్రం అట్ట‌డుగున ఈ పురాత‌న ర‌హ‌దారిని ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు. సోలిన్ సైట్ వద్ద డైవింగ్ చేస్తున్న పురావస్తు బృందం గ్రాడినా బే యొక్క మధ్య భాగాన్ని పరిశీలించగా సోలిన్ వద్ద ఉన్న ఒక స్థిరనివాసం దాదాపు 4 నుండి 5 మీటర్ల లోతులో ఉంద‌ని అని పరిశోధకులు ఫేస్‌బుక్ స్టేట‌స్‌లో తెలిపారు. ఈ ప్రదేశంలో చెకుముకి బ్లేడ్‌లు, రాతి గొడ్డళ్లు వంటి నియోలిథిక్ కళాఖండాలు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని చెప్పారు. మ‌రోవైపు సోలిన్ సైట్ ఇంకా పూర్తిగా త్రవ్వలేద‌ని, హ్వార్ సంస్కృతి .. దాని జీవన విధానం గురించి మనకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయని పరిశోధకులు వెల్ల‌డించారు. ఇప్పుడీ వార్త వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement