Tuesday, November 26, 2024

హార్వ‌ర్డ్ లా రివ్యూ ప‌బ్లికేష‌న్ కి అధ్య‌క్షురాలిగా.. భార‌త సంత‌తికి చెందిన అప్సర్ అయ్యర్

ప్ర‌తిష్టాత్మ‌క హార్వ‌ర్డ్ లా రివ్యూ ప‌బ్లికేష‌న్ కి 137వ అధ్య‌క్షురాలిగా అప్సర్ అయ్యర్ ఎన్నిక‌య్యారు. 136 ఏళ్ల పబ్లికేషన్ చరిత్రలో ఓ భారత సంతతి వ్యక్తి ఈ బాధ్యత చేపట్టడం ఇదే తొలిసారి. విద్యార్థుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పత్రికకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, సుప్రీం కోర్టు జస్టిస్ రూత్ బదేర్ గిన్స్‌బర్గ్ సైతం గతంలో దీనికి నేతృత్వం వహించారు. లా రివ్యూ అధ్యక్షురాలిగా ఎన్నికవడంపై అప్సర అయ్యర్ హర్షం వ్యక్తం చేశారు. పబ్లికేషన్ ప్రతిష్ఠని ఇనుమడింప జేస్తానని ఆమె అన్నారు. పబ్లికేషన్‌లో కథనాల ఎంపిక, పరిశీలన ప్రక్రియలో మరింత మంది ఎడిటర్లను భాగస్వాములను చేస్తానని కూడా పేర్కొన్నారు. కాగా..అప్సర్ గతంలో లా స్కూల్‌కు చెందిన హార్వర్డ్ రైట్స్ జర్నల్, నేషనల్ సెక్యూరిటీ జర్నల్‌కు సంబంధించిన అంశాల్లోనూ సేవలందించారు. అప్సర్ అయ్యర్ 2016లో యేల్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రం, గణిత శాస్త్రం, స్పానిష్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement