అనంతపురం ఎస్ ఎస్ బీఎన్ కళాశాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దాంతో పోలీసులు లాఠీ ఛార్జ్ ని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఘటనలో జయలక్ష్మి అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని తలకు గాయమైంది. దీంతో అప్పటి నుంచి ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అనంతపురం వచ్చి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణలో గాయపడిన విద్యార్థిని జయలక్ష్మిని అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి పరామర్శించారు. నిజాయితీ పక్షాన జయలక్ష్మి నిలిచిదంటూ అభినందించారు. నేరుగా విద్యార్థిని ఇంటికి వెళ్లిన ఎస్పీ శభాష్ జయలక్ష్మి అంటూ ప్రశంసించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాన్ని వెల్లడించిన జయలక్ష్మి ఎందరికో ఆదర్శనీయమంటూ ఎస్పీ అభినందించారు.. తనపై రాయి పడటంతోనే తలకు గాయమైందని విద్యార్థిని వివరించిందని వెల్లడించారు.
‘విద్యార్థి’ని పరామర్శించిన ఎస్పీ..రాయి తగలడం వల్లే గాయమైందన్న జయలక్ష్మి..
Advertisement
తాజా వార్తలు
Advertisement