పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ పోస్ట్ కి ఎంపికయ్యారు అసీమ్ మునీర్. పాకిస్థాన్ సైన్యానికి కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ ను నియమిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించి, ప్రతిభ ఆధారంగా మునీర్ ను ఎంపిక చేసినట్లు రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ మీడియాకు వెల్లడించారు. సైన్యంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయగల ఈ పోస్టుకు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై కొంతకాలంగా పాక్ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.ఆర్మీ చీఫ్ పదవిని ఆశించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని వార్తలు వెలువడ్డాయి. అయితే, దేశ చీఫ్ స్పైగా సేవలందిస్తున్న అసీమ్ మునీర్ ను ప్రభుత్వం ఆర్మీ చీఫ్ పోస్టుకు ఎంపిక చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement