టెక్నాలజీలో యుత్‌ని ప్రోత్సహించేలా కేంద్ర కొత్త కొత్త పథకాలను తీసుకొస్తోంది. ఇందులో బాగంగా చిప్ప్ టు స్టార్టప్ ప్రోగ్రామ్‌ని ప్రవేశపెట్టింది. దీనికి పలు విద్యాసంస్థలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ నెలాఖరులో దరఖాస్తులు చేసుకోవాలని ఔత్సాహికులకు పిలుపునిచ్చింది.
చిప్స్ టు స్టార్టప్ (C2S) ప్రోగ్రామ్ కింద 100 విద్యాసంస్థలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థలు, స్టార్టప్‌లు, MSMEల నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (MeitY) దరఖాస్తులను కోరుతోంది. ఈ కార్యక్రమం ద్వారా 85,000 మంది అధిక నాణ్యత, అర్హత కలిగిన ఇంజనీర్‌లకు చాలా పెద్దస్థాయి ఇంటిగ్రేషన్ (VLSI), ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్‌లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీనికి 5 సంవత్సరాల పాటు 175 ASICలు (అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు), 20 సిస్టమ్ ఆన్ చిప్ (SoC) యొక్క వర్కింగ్ ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. నోడల్ ఏజెన్సీ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోంది.