– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
Apple iOS, macOSలో తలెత్తిన పలు ఇంటర్నల్ బగ్స్‌ని క్లియర్ చేసినట్టు ఆపిల్ సంస్థ వెల్లడించింది. ఈజీగా హ్యాక్ చేసేందుకు వీలుగా ఉండే జీరో-డే లోపంతో సహా CVE-2022-32917 అని పిలువబడే బగ్స్, కెర్నల్ ప్రాబ్లమ్‌తో ఎఫెక్ట్ అయ్యే పలు అంశాలను పరిష్కరించినట్టు తాజా ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా Apple iOS 15.7, iPadOS 15.7, macOS Monterey 12.6, macOS బిగ్ సుర్ 11.7 అప్డేట్స్లో బగ్‌ని పరిష్కరించినట్టు ఆపిల్ సెక్యూరిటీ అప్డేట్ టీమ్ తెలిపింది.
TechCrunch తెలిపిన ప్రకారం.. ఇది ఈ సంవత్సరం Apple ద్వారా పరిష్కరించబడిన ఎనిమిదో జీరో-డే సమస్యగా తెలుస్తోంది. ఈ పరిష్కారాలతో పాటు ఆపిల్ అడ్రస్ బార్ స్పూఫింగ్‌కు దారితీసే సఫారి బ్రౌజర్ వైఫల్యాన్ని కూడా పరిష్కరించినట్టు తెలుస్తోంది.
ఇక.. iOS 16తో అప్డేట్ వర్షన్ అందుబాటులోకి వచ్చింది.దీంతో పలు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇది Apple పాస్‌కీలు, లాక్డౌన్ మోడ్‌కు అనుకూలంగా ఉండడం సహా అనేక సెక్యూరిటీ, ప్రైవేట్ అంశాలను కలిగి ఉంది. “సాఫ్ట్ వేర్‌ను అప్డేట్ చేయడం ద్వారా ఆపిల్ పరికరాలు, ప్రైవసీని సేఫ్‌గా ఉంచడానికి మీరు చేయగలిగే ముఖ్యమైన విషయాలలో ఒకటి” అని కంపెనీ తెలిపింది. కాగా, iOS, iPadOS, tvOS, watchOS కోసం సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసిన చేసిన తర్వాత అది పాత వర్షన్లను తిరిగి పోవడం కష్టమవుతుంది.
గత నెలలో యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లు , మాక్‌ల కోసం కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్లను విడుదల చేసింది. హ్యాకర్లకు చిక్కి దోపిడీకి గురికాకుండా టెక్ దిగ్గజంఆపిల్ ఇంతకుముందు రెండు సెక్యూరిటీ లోపాలకు పరిష్కారం చూపింది. సఫారి, ఇతర ఆప్‌లకు సహకారిగా ఉండే బ్రౌజర్ ఇంజిన్, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రధానమైన కెర్నల్లో రెండు బగ్స్‌ని ఇంతకుముందు కనుగొన్నారు.