Wednesday, November 20, 2024

బీజేపీతో అప్నాదళ్‌ సీట్ల సర్దుబాటు, 36 స్థానాల కోసం పటేల్‌ పట్టు.. ససేమిరా అంటున్న బీజేపీ

లక్నో : యూపీ ఎన్నికల ప్రారంభానికి నెల రోజుల కంటే తక్కువ సమయమే ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీ, అప్నాదళ్‌ మధ్య సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రావడం లేదు. రెండు రోజులుగా గంటల తరబడి చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. 36 సీట్లు తమకు ఇవ్వాలని అప్నాదళ్‌ పట్టుబడుతున్నది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో అప్నా దళ్‌ నేతలు పలుమార్లు భేటీ అయ్యారు. నిషాద్‌ పార్టీ లీడర్స్‌, అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌.. డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యా భేటీలో పాల్గొన్నారు.

గతంలో 11 సీట్లు ఇచ్చారని, ఈసారి కనీసం 36 సీట్లు కేటాయించాలని పటేల్‌ పట్టుబడుతున్నారు. ధీటైన అభ్యర్థులను రంగంలోకి దించుతామని, అన్నీ సీట్లు గెలుస్తామని బీజేపీకి భరోసా ఇస్తున్నది. అయినా కమలం పార్టీ ససేమిరా అంటున్నది. గతంలో 11 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాల్లో గెలిచామని చెప్పుకొచ్చారు. సింగిల్‌ డిజిట్‌ స్థానాలు ఇస్తామని బీజేపీ చెబుతున్నది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అప్నాదళ్‌ పార్టీ ఉంది. ఒకటి రెండు రోజుల్లో సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement