ఓ అపార్ట్ మెంట్ యజమానికి ఫిబ్రవరి నెలలో కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్ల,21లక్షల,05,218 బిల్లు వచ్చింది. ఈ సంఘటన మహబూబాబాద్ గోపాల్ రెడ్డి నగర్ లో చోటు చేసుకుంది. బొల్లం నాగేశ్వరరావు అనే వ్యక్తి సంవత్సరం కిందట 302 నెంబరు పోర్షన్ కొనుగోలు చేశారు. అతడు అమెరికాలో ఉంటుండగా.. ఏడాదిగా పోర్షన్ ఖాళీగా ఉంటోంది. నెలకు సాధారణ బిల్లు రూ. 175 వస్తోంది. ఫిబ్రవరి 14న సిబ్బంది మీటర్ రీడింగ్ తీశారు. ఎక్కువ నమోదు కావడంతో ఆ వినియోగదారుడికి రూ. 3,21,05,218 బిల్లు వచ్చింది. గృహయజమాని సోదరుడు ఈ సమస్యను మీడియాకి తెలిపారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్తు శాఖ అధికారులు వెంటనే సరిదిద్దారు. మరోసారి మీటర్ రీడింగ్ చూసి వినియోగదారుడికి సర్వీస్ ఛార్జి రుసుముగా రూ. 175 బిల్లు వేశారు. సాంకేతిక లోపంతో అధిక బిల్లు వచ్చిందని, తమ దృష్టికి రాగానే సరిచేయించినట్లు మహబూబాబాద్ ఈఆర్‌వో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఎం.రమేశ్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..