Friday, November 22, 2024

ఏపీ ‘జెన్ కో థర్మల్’ కేంద్రంలో సహాయ నిరాకరణ ఉద్య‌మం

ముత్తుకూరు, (ప్రభ న్యూస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఏపీజెన్ కో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రంలో, ఏపీ జెన్ కో ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగస్తులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. నేటి ఉదయం 10 గంటల నుంచి మూకుమ్మడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓ వైపు విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగించకుండా విధులు నిర్వహిస్తూ మరోవైపు కొంతమంది సహాయ నిరాకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పై తిరుగుబాటు చేశారు. ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ జెన్ కో బ్రాంచ్ ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. ఏపీ జెన్ కో ప్రాజెక్టుకు సంబంధించిన కంట్రోల్ రూమ్ లో మాత్రం సిబ్బంది విద్యుదుత్పత్తికి ఆటంకం లేకుండా.. విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని విభాగాలకు చెందిన వారు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఏపీ జెన్కో ప్రాజెక్టు ముఖ్య పరిపాలన భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ కార్యక్రమం జరిగింది. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక మద్దతు తెలిపింది. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగరాజు తన కార్యాలయంలో లేకపోవడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంజనీర్లు ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సహాయ నిరాకరణ పాటించారు.

జనవరి నెలకు సంబంధించిన వేతనాలు ప్రభుత్వం చెల్లించే అంతవరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని అప్పటివరకు కూర్చున్నచోట నుంచి కదిలే ప్రసక్తే లేదని ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, భీష్మించుకుని కూర్చున్నారు. పెద్ద ఎత్తున నినాదాలతో పరిపాలనా భవనం మారుమోగింది. రాష్ట్ర ప్రభుత్వ పాలకులు మొండి వాళ్ళు అయితే తాము అంత కంటే మొండిగా వ్యవహరిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండికూడా వేతనాలు ఇవ్వడం లేదని జేఏసీ నాయకులు గుమ్మడి శ్రీనివాసులు, కృష్ణ చైతన్య, సుధాకర్ మరికొంతమంది రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గత రెండు సంవత్సరాలుగా విద్యుత్ ఇంజనీర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది అని అన్నారు. ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకో ని వ్వరా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులు వేతనాలు చెల్లించినట్లు గా చరవాణి లకు మెసేజ్ సమాచారం వచ్చేంతవరకు సహాయ నిరాకరణ ఉంటుందని జేఏసీ నాయకులు తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement