ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎక్కువ సీట్లు పొందడమే కాదు అధిక సంఖ్యలో ఓట్లనూ కొల్లగొట్టింది. ఇక ఏపీలో తమకు తిరుగులేదు అన్నట్లుగా వైసీపీ దూసుకుపోతోంది. సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం షరామాములే. కానీ ఈ రేంజ్లో సీట్లు, ఓట్లు రావడం ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనే వైసీపీకి వచ్చిన సీట్లు చూసి ఖంగుతిన్న ప్రతిపక్షాలు.. పురపాలక ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ కావడంతో ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటుబ్యాంకు భారీగా పెరగడం గమనార్హం. ఇదే సమయంలో ప్రతిపక్షం టీడీపీ మాత్రం భారీగా ఓట్లు కోల్పోయింది. ఓట్ల శాతం చూస్తే.. వైసీపీ 53.63%, తెలుగు దేశం పార్టీ 30.73%, జనసేన 4.67%, భారతీయ జనతా పార్టీ 2.41, స్వతంత్రులు 5.37, నోటా ఆప్షన్‌కు 1.07% ఓట్లు పొందడం జరిగింది. ఇక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కనీసం 1% ఓట్లనైనా పొందలేకపోయాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement