ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. వారం రోజులు దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్ననే గౌతమ్ రెడ్డి హైదరాబాద్ కి వచ్చారు. అయితే, ఆయనకు గుండెపోటు రావడంతో అపోలో ఆస్పత్రిలో తరలించారు. అయితే, అప్పటికే ఆయన కన్నుమూశారు.
2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్ రెడ్డి రాజకీయ అంరగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ రెండోసారి ఆత్మకూరు నుంచి గెలుపొందారు. గౌతమ్ రెడ్డి మృతితో వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు.