ఒకప్పుడు ఏపీలో పది ఎకరాలు అమ్మితే , తెలంగాణలో వంద ఎకరాలు కొనేవారని, ఇప్పుడు రివర్స్ అయిందని ఏపీ భూముల రేట్లపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో భూముల ధరలు పడిపోయాయన్నారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చర్ క్లబ్ లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి జాతీయ సంబరాలు ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు ఏపీ, తెలంగాణ మంత్రులు ఆవంతి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్ పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో అల్లూరి పుట్టి ఉంటే 24 సెంట్లు కాదు.. 24 ఎకరాలలో మ్యూజియము ఏర్పాటు చేసే వాళ్ళమని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల లో అల్లూరి ని గుర్తు పట్టని వ్యక్తి ఎవరు ఉండరని.. జాతీయ స్థాయిలో అల్లూరికి గుర్తింపు రాలేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు పట్ల , తెలుగు రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం కావొచ్చన్నారు. పార్లమెంట్ లో ఆయన విగ్రహం లేదు, దానికి కిషన్ రెడ్డి సహకరించాలని.. ఏపీ లో రాజులు ఆనందంగా ఉన్నారో లేదో గాని తెలంగాణ లో రాజులు సంతోషంగా ఉన్నారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..