సమ్మెబాట పట్టారు జూనియర్ డాక్టర్లు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జుడాలు సమ్మెకి సిద్ధమయ్యారు. ఈ మేరకు విజయవాడలో ఓపి సేవలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. తమపై దాడులు చేయటం సబబేనా అంటూ నిలదీశారు. చట్టాలు ఉన్నా వాటిని అధికారులు అమలు చేయడం లేదన్నారు.. మొక్కుబడి చర్యల వల్ల తమకి రక్షణ లేకుండా పోయిందని , కఠిన శిక్షలు ఉంటేనే దాడులను అరికట్టవచ్చని అన్నారు.
తమకి భద్రత ఉంటుందనే భరోసాని ప్రభుత్వమే కల్పించాలని జూనియర్ డాక్టర్స్ డిమాండ్ చేశారు. దాడులు చేసిన వారిని అరెస్టు చేసి వెంటనే శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ మేరకు నేటి నుంచి ఓపి సేవలను నిలిపివేశామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి అత్యవసర సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు జూనియర్ డాక్టర్లు. కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించామని వాపోయారు. ఇటీవల కాలంలో తమపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.