Tuesday, November 26, 2024

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఫలితంపై టెన్షన్

కృష్ణా జిల్లా కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మన్ ఎన్నిక‌ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం కొండప‌ల్లి మున్సిప‌ల్ చైర్మెన్ ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌రిగాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను నిన్న ప్రకటించ లేదు. నేడు టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిసియో ఓటుపై హైకోర్టు తుది నిర్ణ‌యం తీసుకుంటుంది. అనంతరం ఫలితం వెల్లడి కానుంది.

మొత్తం 29 వార్డులు ఉన్న కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీకి 15, వైసీపీకి 14 స్థానాలు వచ్చాయి. నిన్న చైర్మెన్ ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నికలో టీడీపీ నుంచి చెన్నిబోయిన చిట్టి బాబు, వైసీపీ నుంచి జోగి రాము పోటీ చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎంపీ కేసినేని నాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు వైసీపీ పార్టీ తరఫున ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్ల అనంతరం టీడీపీ బలం 16కి, వైసీపీ బలం 15కి పెరిగింది. అయితే పోలైన ఓట్ల ప్రకారం తెలుగుదేశం పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ పై జెండా ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement