Friday, November 22, 2024

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అమరావతి భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వగా.. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం నుంచి హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం దురుద్దేశంతోనే కేసు పెట్టిందని చంద్రబాబు తరఫు లాయర్లు వాదించగా.. అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సీఐడీని కోర్టు కోరింది. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులను కోర్టు ప్రశ్నించింది. దీంతో విచారణ తొలిదశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టుకు వివరించారు. పూర్తిస్థాయిలో విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఐడీ కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అటు మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌పైనా కోర్టు విచారణ జరిపి స్టే విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement