ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను విచారించిన హైకోర్టు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌లపై తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయన హయాంలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement