Thursday, November 21, 2024

సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభాత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ పరిశ్రమను తమ అధీనంలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనపై హైకోర్టు నీళ్లు చల్లింది. సంగం డెయిరీని తమ ఆధీనంలోకి తీసుకు వస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ జీవోపై సవాల్ చేస్తూ హైకోర్టులో సంగం డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ప్రభుత్వ జీవోను కొట్టివేసింది. అంతేకాదు సంగం డెయిరీ ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లే కొనసాగవచ్చని స్పష్టం చేసింది.

కాగా సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని ఏపీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు. కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరికి కారోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్నారు. దీంతో విచారణ కష్టమవుతోందని హైకోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement