టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ బెయిల్ పిటిషన్పై శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఉమపై జి.కొండూరు పోలీసు స్టేషన్లో అక్రమ కేసులు నమోదయ్యాయని ఉమ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదలను విన్న తర్వాత తదుపరి విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
మరోవైపు దేవినేని ఉమను తమ కస్టడీకి ఇవ్వాలని జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ప్రస్తుతం దేవినేని ఉమ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనపై హత్యాహత్నం, కుట్రతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
ఈ వార్త కూడా చదవండి: వచ్చేవారం పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ