Tuesday, November 26, 2024

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రజని.. తెలంగాణలో సంబరాలు చేసిన ప్రజలు!

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా విడదల రజని ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కారణం.. ఆమె తెలంగాణ బిడ్డ కావడమే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కుమార్తే రజని. దాదాపు 4 దశాబ్దాల క్రితం సత్తయ్య బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లి సఫిల్‌గూడలో ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె అయిన రజని ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన రజని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడామెకు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలు ఆమెకు కేటాయించారు. రజని మంత్రి అయిన విషయం తెలిసిన వెంటనే కొండాపురం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement