Tuesday, November 26, 2024

విద్యుత్ ఉద్యోగుల సేవింగ్స్ సొమ్ముపై ఎపి ప్ర‌భుత్వం క‌న్ను…

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌ కో, విద్యుత్‌ పంపిణీ సంస్థల ఉద్యోగులు.. ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌లో దాచుకున్న మొత్తాలు మెచ్యూర్‌ కావటంతో ఆ నిధుల్ని ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడులుగా మళ్లించేం దుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. ఈ ఉద్యోగులు దాచుకున్న మొత్తం ఈనెల 27కు మెచ్యూరీటి అయ్యింది. ఈ మొత్తం రూ. 2,400 కోట్ల వరకూ ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, మొత్తాన్ని ఏపీ బేవరేజస్‌ కార్పోరేషన్‌లో పెట్టు-బడులుగా పెట్టాలంటూ ఆర్థిక శాఖతో పాటు- పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్టు- తెలుస్తోందని వారు పేర్కొంటున్నారు. విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు చెందిన పీఎఫ్‌ ట్రస్టు, గ్రాటు-్యటీ- ట్రస్టుకు చెందిన నిధుల్ని ఏపీ బేవరేజస్‌ కార్పోరేషన్‌లో పెట్టు-బడులుగా పెట్టాలంటూ రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌ కో, విద్యుత్‌ పంపిణీ సంస్థల్లోని ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌లో వారు దాచుకున్న మొత్తాలు మెచ్యూర్‌ కావటంతో రూ. 2,400 కోట్ల మొత్తాన్ని ఏపీ బేవరేజస్‌ కార్పోరేషన్‌లో పెట్టు-బడులుగా పెట్టాలంటూ ఆర్థిక శాఖతో పాటు- పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్టు- తెలుస్తోం ది.

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు చెందిన పీఎఫ్‌ ట్రస్టు, గ్రాటు-్యటీ- ట్రస్టులో మార్చి 27 తేదీ నాటికి వివిధ మొత్తాలు మెచ్యూర్‌ కావటంతో ఆ నిధుల్ని ఏపీ బేవరేజస్‌ కార్పోరేషన్‌ లో పెట్టి వాటిని మళ్లించేందుకు పై స్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్టు- తెలుస్తోంది. విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు ప్రతీ నెలా చెల్లించిన పీఎఫ్‌, గ్రాటు-్యటీ- మొత్తాలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌లో పెట్టు-బడులుగా పెట్టారు. వడ్డీతో కలిపి మొత్తం రూ. 2,400 కోట్లు మార్చి 27తేదీ నాటికి మెచ్యూర్‌ అయ్యాయి. ఏపీ జెన్‌ కో ఉద్యోగులకు చెందిన రూ. 1,500 కోట్లు, ఏపీ ట్రాన్స్‌ కో ఉద్యోగులకు చెందిన రూ. 300 కోట్లు-, ఏపీ తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థలోని ఉద్యోగుల భవిష్య నిధి రూ. 150 కోట్లు-, అలాగే ఎస్పీడీసీఎల్‌కు ఉద్యోగులకు చెందిన రూ. 300 కోట్లు-, సీపీడీసీఎల్‌కు చెందిన మరో రూ. 300 కోట్లు- మొత్తంగా రూ. 2,400 కోట్లు ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ నుంచి మెచ్యూర్‌ అయ్యాయి. అయితే, ఈ మొత్తాన్ని ఏపీ బేవరేజస్‌ కార్పోరేషన్‌కు చెందిన బాండ్లలో పెట్టాలంటూ ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఇవి స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కాకపోవడంపై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై 8.5 శాతం వడ్డీ కూడా ఇస్తామంటూ ఆయా సంస్థలపై ఆర్థిక శాఖ ఒత్తిడి తెస్తున్నట్టు- తెలుస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ బాండ్లేవీ లిస్టు కాకపోవటంతో అవి ఎంతవరకూ సురక్షితం అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
నిధులు వాడుకున్న ప్రభుత్వం ?
వాస్తవానికి విద్యుత్‌ సంస్థలకు చెందిన ఉద్యోగులు నెలనెలా దాచుకున్న పీఎఫ్‌ గ్రాటు-్యటీ- మొత్తాలను ఆయా సంస్థలు ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ వద్ద పెట్టు-బడులుగా పెట్టాయి. దీనికి 9.6 శాతం మేర వడ్డీ కూడా చెల్లించారు. ఈ నెల 27తో గడువు ముగియటంతో వాటిని చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ వద్ద ఆ నిధులు పెట్టినా… వివిధ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధుల్ని వినియోగించుకుందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ నుంచి ఆ నిధుల్ని సాంకేతికంగా బేవరేజస్‌ కార్పోరేషన్‌ బాండ్లలో పెట్టు-బడులు పెట్టినట్టుగా బదలాయించాలని ఆర్థికశాఖ ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. బాండ్లకు గ్యారెంటీ- లేకపోవటం, పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ చెల్లించిన వడ్డీకంటే బేవరేజస్‌ కార్పోరేషన్‌ బాండ్ల వడ్డీ ధర తక్కువ కావటంపై విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement