Tuesday, November 26, 2024

కేసీఆర్ దగ్గరికెళ్లి సమస్యను పరిష్కరించండిః జగన్ కు సోమిరెడ్డి సూచన

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల స‌మ‌స్య‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో చ‌ర్చించి ప‌రిష్క‌రించాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌కు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సూచించారు. ‘వైఎస్ జ‌గ‌న్ గారూ ఇప్పటికైనా కేసీఆర్ దగ్గరికెళ్లి సమస్యను సామరస్యంగా పరిష్కరించండి. కృష్ణా డెల్టాకు 70 టీఎంసీల గోదావరి నీళ్లు అందుబాటులోకి వచ్చిన క్రమంలో ఆ మేర రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నుంచి నికర జలాలు కేటాయిస్తూ జీఓ ఇవ్వండి’ అని సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఏపీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాయలసీమ,నెల్లూరు,ప్రకాశం జిల్లాల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. ఏం తెలుసని,ఏం అవగాహన ఉందని కేంద్రం నోటిఫికేషన్ ను సజ్జల స్వాగతిస్తారని ప్రశ్నించారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏకమవుతామని, తాడోపేడో తేల్చుకుంటామని సోమరెడ్డి స్పష్టం చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిలికి చిలికి గాలివానగా మారిన జల వివాదానికి కేంద్రం ఇటీవల చెక్ పెట్టింది. నదీజలాల పంపకాల వ్యవహారం, సర్వ హక్కులు కేంద్రం గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. కృష్ణా గోదావరి బేసిన్ లను మొత్తంగా కేంద్రం తన ప్రత్యక్ష అధికార పరిధిలోకి తీసుకొస్తూ గెజిట్ జారీచేసింది. ఈ గెజిట్ ప్రకారం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అధికార పరిధి అక్టోబర్ 14 2021 నుండి మొదలవుతుందని పేర్కొన్నారు.

కేంద్ర విడుదలచేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇక నుండి కృష్ణా-గోదావరి నీటి పంపకం కేంద్ర చేతుల్లోకి వెళుతుంది. ఇక నుండి ఈ రెండు నదులపై ఉన్న ప్రాజెక్టులలో ఏ అవసరానికి నీటిని విడుదల చేయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. పైగా కొత్తగా ఏర్పాటు అయ్యే బోర్డు నిర్వహణ ఖర్ఛుల క్రింద ఏ.పి -తెలంగాణలు ఏటా చేరి 200కోట్లు జమచేయవలసి ఉంటుంది. రెండు నదులపై ఉండే ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటాయి.

- Advertisement -

ఇది కూడా చదవండిః ఏపీలో 62 మంది జూనియర్ జడ్జిలు బదిలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement