Tuesday, November 26, 2024

AP Governor: వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం మానవ జీవితంలో అంతర్భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విపత్కర పరిస్ధితుల కారణంగా సర్వం కోల్సోయిన వారికి ప్రతి ఒక్కరూ తమవంతు సాయం అందించాలన్నారు. తన విచక్షణాధికారాలతో రెడ్ క్రాస్ కు సమకూర్చిన రూ.25 లక్షల నిధులతో వరద బాధితుల సహాయార్ధం సమకూర్చిన సామాగ్రితో సిద్ధం చేసిన లారీలకు గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వివిధ సందర్భాలలో రెడ్ క్రాస్ వాలంటీర్లు అందిస్తున్నసేవలు వెలకట్టలేనివన్నారు. కరోనా కష్టకాలం ఇంకా ముగియ లేదని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముఖముసుగు ధరించటం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, సామాజిక దూరం పాటించటం తప్పనిసరని గవర్నర్ పేర్కొన్నారు.

తొలి విడతగా వెయ్యి కుటుంబాల కోసం సామాగ్రిని సిద్దం చేయగా, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో వీటిని రెడ్ క్రాస్ నేతృత్వంలో పంపిణీ చేయనున్నారని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా గవర్నర్ కు వివరించారు. ఒక్కో కుటుంబానికి పదికిలోల బియ్యం, ఒక్కొక్క కిలో కందిపప్పు, పెసరపప్పు, గోధుమపిండి, ఇడ్లీరవ్వ, పంచదార, ఉప్పు, చింతపండు, మిరపపొడి, దుప్పటి తదితర వస్తువులతో కూడిన కిట్ ను అందిస్తున్నామని రెడ్ క్రాస్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. తన విచక్షణాధికారాలతో గవర్నర్ వరద బాధితుల సహాయార్ధం రూ.25 లక్షలు కేటాయించటం చిన్న విషయం కాదని రెడ్ క్రాస్ కార్యదర్శి ఎకె ఫరీడా చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement