Tuesday, November 26, 2024

గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీలు వీరే.. ప్రభుత్వ సిఫారసుకు ఆమోదం

గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్ ఆమోదం తెలిపారు. సీఎం వైఎస్ జగన్ రాజ్ భవన్‌‌లో గవర్నర్‌ను భేటీ అనంతరం అమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తిని మన్నించినందుకు గవర్నర్‌కు ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గవర్నర్ కోటాలో ఖాళీ అయిన నలుగురు ఎమ్మెల్సీల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా  లేళ్ల తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి), మోషేన్‌ రాజు(పశ్చిమగోదావరి), అప్పిరెడ్డి(గుంటూరు జిల్లా), రమేశ్‌ యాదవ్‌(అనంతపురం జిల్లా)తో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపింది. నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లు ఆమోదం తెలపాలని గవర్నర్‌ను సీఎం జగన్ కోరారు. దీంతో ఈ నలుగురు ఎమ్మెల్సీ పేర్లను గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్ ఖరారు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే ఈ నలుగురు శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాగా, లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు టీడీపీ నేత వర్ల రామయ్య గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫైల్‌ను గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారు. అయితే, ఎమ్మెల్సీల నియామకం ఫైల్ వెళ్లి 4రోజులైనా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. జగన్‌ వివరణ అనంతరం గవర్నర్ ఆమోదించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement