Wednesday, November 20, 2024

ఏపీలో నేడు మరో పథకం.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.10వేలు

ఏపీలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద లబ్ధిదారులకు చెల్లించడానికి రూ.119.88 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. చేపల వేటను నిషేధించిన సమయంలో జీవనోపాధి కోల్పోయిన ఒక్కో మత్స్యకార కుటుంబానికి ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

గతంలో రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చిన భృతి మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. రెండేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ విధంగా 2019లో 1,02,478 కుటుంబాలకు రూ.102.48 కోట్లు లబ్ధి చేకూర్చగా, 2020లో 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్ల మేర సాయమందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement