Thursday, November 21, 2024

ఏపీలో మాస్క్ మస్ట్.. లేకపోతే రూ.100 ఫైన్!

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. రోజు, రోజుకు కేసులు సంఖ్య పెరిగిపోతున్నాయి. అయినా సరే చాలామంది ఇప్పటికీ మాస్కు లేకుండా తిరుగుతున్నారు. దీంతో వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మాస్కు లేకుండా ఎవరైనా బయట తిరిగితే వారికి రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు మంగళవారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చారు. రోడ్డుపైకి ఎవరైనా మాస్కు లేకుండా వస్తే జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు.

షాపులు లేదా వ్యాపార సంస్థలు, కమర్షియల్‌ కాంప్లెక్సుల్లో 5 అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే, షాపింగ్‌ మాల్స్, సినిమా హాళ్లు వంటి చోట సీటు మార్చి సీటు అంటే మధ్యలో సీటు ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి షాపులో, ఇతర చోట్లా శానిటైజర్‌ వేసుకున్న తర్వాతే వినియోగదారులను లోపలికి పంపించాలని ఆదేశించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ మెషీన్లను విధిగా వాడాలని పేర్కొన్నారు. స్విమ్మింగ్‌ పూల్స్‌ అన్నీ వెంటనే మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ఈ నిబంధనల్ని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement