Tuesday, November 26, 2024

సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే డివిజన్ బెంచ్‌లో సైతం ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు జగన్ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

కాగా సంగం డెయిరీ కేసులో సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర చౌదరిపై గతంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వాళ్లిద్దరికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement