ఏపీ సీఎం జగన్ ను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార,వ్యవసాయసంస్థ సభ్యులు కలిశారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో జగన్ తో ఎఫ్ ఏఓ బృందంతో పాటు భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రతినిధులు కూడా ఉన్నారు. జగన్ తో చర్చల అనంతరం ఏపీ ప్రభుత్వంతో ఎఫ్ఏఓ ఒప్పందం కుదుర్చుకుంది.ఎఫ్ఏఓ అంటే… ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తుంది. అందరికీ ఆహార భద్రత కోసం ఎఫ్ఏఈ అంతర్జాతీయంగా కృషి చేస్తోంది. ఎఫ్ఏఓ తరఫున ఆ సంస్థ భారత విభాగం డైరెక్టర్ టోమియో షిచిరి, ఐసీఏఆర్ తరఫున డిప్యూటీ డీజీ డాక్టర్ ఏకే సింగ్, ఏపీ ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఈ మేరకు సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థల ఏర్పాటు, రాష్ట్రంలో రైతుల నైపుణ్యాభివృద్ధి అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి ఎఫ్ఏఓ సాంకేతిక సహకారం అందించనుంది. ఎఫ్ఏఓ ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలకు సాంకేతికంగా, ఆర్థికంగా సాయం అందించనుంది. అందుకు ఐసీఏఆర్ కూడా తోడ్పాటు అందించనుంది. అంతేకాదు, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలకు ఎఫ్ఏఓ శిక్షణ ఇవ్వనుంది. ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు ఎఫ్ఏఓ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..