Friday, November 22, 2024

మాస్క్ ధ‌రించ‌ని వారికి రూ. వంద : షాప్ య‌జ‌మానుల‌కు భారీ జ‌రీమానా

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ ధ‌రించ‌నిప‌క్షంలో రూ. 100జ‌రిమానా విధించ‌నుంది ఏపీ స‌ర్కార్ . ఈ మేర‌కు కేంద్ర స‌ర్కార్ , ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యించింది. క‌రోనా ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తూ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఏపీ ప్ర‌భుత్వం రిలీజ్ చేసింది. మాస్క్‌ లేని వారిని దుకాణాలకు రానిస్తే యాజమానికి రూ.10 వేల నుంచి రూ.25వేల మ‌ధ్య జరిమానా ప‌డ‌నుంది. రెండు రోజుల పాటు ఆయా వాణిజ్య‌, వ్యాపార సంస్థలను మూసివేయాల్సి ఉంటుంది. కరోనా నిబంధనల ఉల్లంఘనలపై వాట్సప్‌ ద్వారా 80109 68295 నంబరుకు ప్రజలు కూడా ఫిర్యాదు చేసే వీలుని క‌లిపించింది. ప్రభుత్వం వెల్ల‌డించిన‌ మార్గదర్శకాలను జిల్లాల‌ కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు అమ‌లు చేయాల్సి ఉంటుంది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement