Friday, November 22, 2024

నేటి తో ముగియనున్న నిమ్మగడ్డ పదవి కాలం..

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నేటితో ముగుస్తోంది. ఏపీ ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధమే చేశారు నిమ్మగడ్డ. మొదట కరోనా వేగంగా విస్తరిస్తోంది అంటూ ఎన్నికలను అకస్మాత్తుగా నిలిపివేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అక్కడితో మొదలైంది అసలైన యుధ్ధం. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా ఎన్నికలను ఎలా రద్దు చేస్తారు అంటూ సీఎం జగన్ నేరుగా ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక కులానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్వయానా సీఎం ఆరోపించడంతో.. అప్పటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైలైట్ అవుతూ వచ్చారు. ఆ తరువాత పట్టుపట్టి మరీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. అయితే ప్రభుత్వంతో యుద్ధం ఆగలేదు.

నేటితో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగుస్తోంది. ఆయన పదవి నుంచి తప్పుకుంటూ ఈ ఉదయం 10 గంటలకు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. మరోవైపు నిమ్మగడ్డ స్థానంలో  కొత్త ఎస్ఈసీగా మాజీ సీఎస్ నీలం సాహ్నీని నియమించింది ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. దీంతో నీలం సాహ్నీఏప్రిల్ ఒకటి నుంచే  కొత్త ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement