ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదం పెట్టేందుకు ప్రయత్నించవద్దని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జగన్, షర్మిలకు మధ్య ఎలాంటి వ్యత్యాసాలు, మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం తలెత్తిన నేపథ్యంలో జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదానికి చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నప్పటికీ చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు ఆంధ్ర, తెలంగాణ అంటూ తేడాలు ఏమీ లేవని చెప్పారు. అందరం తెలుగువారమేనని, అందరం ఐక్యంగా ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం వచ్చాక 31.50 లక్షల మంది పేదలకు స్థలం ఇవ్వడమే కాకుండా, ఇళ్లు కూడా కట్టిస్తున్నారని ఆయన చెప్పారు.
జగన్, షర్మిల మధ్య మనస్పర్థలు లేవు: ఏపీ డిప్యూటీ సీఎం
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Breaking news
- AP CM YS Jagan
- AP Deputy CM Narayana swamy
- AP Nesw
- AP NEWS
- ap news today
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu viral news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- YS sharmila
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement