Monday, November 25, 2024

త‌మిళ‌నాడు క‌ల్చ‌ర్ ని ఫాలో అవుతోన్న ఏపీ ఉప ముఖ్య‌మంత్రి – ఉంగ‌రంలో వైఎస్ ఆర్, జ‌గ‌న్ ఫొటోలు

ఇద్ద‌రు నేత‌ల‌తో కూడిన బంగారు ఉంగ‌రం హాట్ టాపిక్ అయింది. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి ఈ ఉంగ‌రాన్ని త‌యారు చేయించుకోవ‌డానికి త‌మిళ‌నాడు క‌ల్చ‌ర్ ని ఫాలో అయ్యార‌ట‌. ఈ ఉంగ‌రంలో ఒక ఫొటో వైఎస్ ఆర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, మ‌రొక ఫొటో జ‌గ‌న్ ది ఉంటుంద‌ట‌. ఎందుకిలా ఉంగరంతో భక్తి చాటుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడు బార్డర్‌లో ఉండే ఈ ఏరియా చాలా ప్రత్యేకమైంది. అందుకే, అక్కణ్నుంచి ఎన్నికైన నారాయణస్వామికి కూడా రాజకీయంగా ప్రత్యేకత ఉంది. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణ స్వామి. జగన్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటిపోయింది.

కాబట్టి కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. తనకు పదవీ గండం ఉందేమోనన్న భయంతోనే నారాయణస్వామి ఇలా ఉంగరంతో భక్తి చాటుతున్నారా లేక వైఎస్‌ కుటుంబంపై అభిమానాన్ని ఈవిధంగా చాటుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది. అయితే, తమిళనాడు కల్చర్‌ను ఎక్కువగా ఫాలో అయ్యే నారాయణస్వామి.. అదృష్టం వరిస్తుందనే నమ్మకంతోనే ఇలా ఉంగరం చేయించుకుని ఉంటారనే వారూ ఉన్నారు. బార్డర్‌లో ఉండే తన నియోజకవర్గంలో ఎక్కువగా.. తమిళ సంస్కృతిని పాటించే జనం ఉంటారు. వారిని ఆకట్టుకోవడంలో ఇదీ భాగమనే అభిప్రాయం ఉంది. తనకు రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించిన ఇద్దరు నేతల్ని దేవుళ్లలా భావిస్తున్నారట నారాయణస్వామి . అందుకే, ఉదయం నిద్రలేవగానే, వారి దర్శనం చేసుకునేలా ఫొటోలతో ఈ రింగు చేయించుకున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement