కరోనా కేసులు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజుల నుంచి కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గింది. గతంలో ప్రతిరోజు 13వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కానీ నేడు దాదాపు వెయ్యి కేసుల వరకు తగ్గాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 12,561 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నేడు కూడా భారీ సంఖ్యలో 12 మంది కరోనా మహమ్మారి వల్ల మృతి చెందారు. కాగా రాష్ట్రంలో రీకవరీ రేటు భారీగా ఉంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 8,742 మంది బాధితులు కరోనా వైరస్ ను జయించారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,300 గా ఉంది. కాగ కరోనా కేసులు సంఖ్య తగ్గినా.. కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తగ్గలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అందరూ కరోనా నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..