నిఘా పరికరాల కొనుగోలు కోసం రూ.25.5కోట్లు వెచ్చించి..అందులో నిబంధనలే ఏమాత్రం పాటించలేదని ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఏబీ అప్పీల్ చేసుకున్నారు. తాజాగా ఈ అప్పీల్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఏబీపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర హోం శాఖ ఖరారు చేసింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో ఏబీపై చార్జిషీట్ దాఖలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..